Monday, November 18, 2024

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం… రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జగన్ అన్నారు. కోవిడ్‌ కారణ ంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.

వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని.. వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement