కొత్త కరోనా వేరియంట్ లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా యూపీలో కప్పా వేరియంట్ వెలుగుచూసినట్లు బీఆర్డీ మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీకి చెందిన డాక్టర్ అమరేష్ సింగ్ తెలిపారు. ఇది బీ 1.617 జన్యువు మ్యుటేషన్‌తో ఉద్భవించింది. ఇది డెల్టా వేరియంట్‌కు కారణంగా నిలుస్తుంది. బీ.1.617కు 12కుపైగా మ్యుటేషన్లు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా ఈ4848 క్యూ, ఎల్452 ఆర్ కనిపిస్తున్నాయి. అందుకే ఈ వేరియంట్ ను డబుల్ మ్యుటెంట్‌గా పిలుస్తున్నారు. ఇది మెల్లమెల్లగా అభివృద్ధి చెంది బీ.1.617కు సంబంధించిన కొత్త వంశాన్ని సిద్ధం చేస్తుంది. బీ.1.617.2ను డెల్టా వేరియంట్‌గా పిలుస్తారు. ఇదే భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్‌కు కారణంగా నిలిచింది. కరోనాకు చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకారి అని నిపుణులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రాయదుర్గంలో సీఎం జగన్..ఇడుపులపాయ వెళ్లేది ఎప్పుడు ?