Thursday, November 21, 2024

Delhi: తెలంగాణ-హరియాణ మధ్య సాంస్కృతిక మార్పిడి.. విద్యార్థులకు రాజ్ భవన్లో ఆతిథ్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏక్‌ భారత్‌ – శ్రేష్ట భారత్‌లో భాగంగా తెలంగాణ, హరియాణా రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం ఘనంగా జరిగింది. వరంగల్ ఎన్‌ఐటీ విద్యార్థులకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ శనివారం హరియాణా రాజ్‌భవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. కురుక్షేత్ర ఎన్‌ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సాంస్కృతిక గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి గవర్నర్‌ దత్తాత్రేయ ప్రసంగించారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మనల్ని ఒక దేశంగా ఐక్యంగా ఉంచే మన సంస్కృతులు, సంప్రదాయాలు, విలువల గొప్పదనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం మన కుటుంబం వంటిదన్న గవర్నర్, దానిని ఎల్లప్పుడూ సంతోషంగా, సంపన్నంగా ఉండేలా చూసుకోవాలి విద్యార్థులకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement