Saturday, November 23, 2024

CUET PG 2024 | రేపటి నుంచే సీయూఈటీ పీజీ పరీక్షలు..

దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూట్) పీజీ – 2024’ ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈసారి మొత్తం 4,62,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న‌ట్టు తెలుస్తొంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, CUTE పీజీ పరీక్షలు రేప‌టి నుంచి (మార్చి 11) 28 వరకు CBT పద్ధతిలో జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

ఆంధ్రప్రదేశ్: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఇక ఇప్ప‌టికే అడ్మిట్‌కార్డులను విడుదలచేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి అభ్యర్థులు త‌మ‌ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఆధారంగా దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement