Saturday, November 30, 2024

Cuddaph – కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – పెద్ద సంఖ్యలో వాహనాలు స్వాదీనం

కడప ప్రతినిధి – ప్రభ న్యూస్ కడప జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రికార్డులు లేని 86 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనుమానితులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరికలు చేశారు. ఆదివారం తెల్లవారుఝామున జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

తనిఖీల్లో రికార్డులు లేని 86 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి, అనుమానితుల సమాచారాన్ని డయల్ 100 ద్వారా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.

- Advertisement -

కడప సబ్ డివిజన్ పరిధిలో.. కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రముక్కపల్లి లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రికార్డులు లేని 21 మోటార్ సైకిళ్ళు, ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ పరిధిలోని మాసాపేట, గౌస్ నగర్ లలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

రౌడీ షీటర్లకు ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో.. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృతా నగర్ లో నిర్వహించిన నాకాబందీ లో రికార్డులు లేని 42 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో.. మైదుకూరు అర్బన్ పి.ఎస్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో రికార్డులు లేని 14 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో.. తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టి.కోడూరు గ్రామంలో పలువురు ఫ్యాక్షనిస్టుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో రికార్డులు లేని 86 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 8 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement