బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్ష ఖాన్ తన వివాహ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్ క్రికెటర్‌తో ఈ ఏడాది అక్టోబరులో ఆమె నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నట్టు ఆమె ప్రకటించింది. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పటికీ… ఇద్దరం మంచి మిత్రులుగా ఉంటామని వివరించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకోవడమే నిశ్చితార్థం రద్దు కావడానికి కారణమని ఆమె తెలిపింది.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభం వల్ల తనకు ఒక విషయం అర్థమయిందని… తనకు కాబోయే భర్త తప్పకుండా భారతీయ వ్యక్తే అయిఉంటాడని చెప్పారు. తన కుటుంబానికి ఆప్ఘనిస్థాన్ మూలాలు ఉన్నాయని, తమది యూసుఫ్ జాయ్ జాతి అని తెలిపారు. అయితే తన తల్లిదండ్రులు, తాతల మాదిరే తాను కూడా భారతీయురాలినేనని చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి: శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి