ఐపీఎల్ సీజన్-17లో భాగంగా నేడు (బుధవారం) చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని సీఎస్‌కే జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక చెన్నై హోం గ్రౌండ్ చెపక్ స్టేడియం వేదికగా జరుగుతన్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
పంజాబ్ కింగ్స్ :
జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (సి), రిలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికె), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్ (సి), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్), దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
CSK: షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, సమీర్ రిజ్వీ.
PBKS: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, రిషి ధావన్, విద్వాత్ కవేరప్ప.
ఈ ఐపీఎల్‌లో రెండు బలమైన బ్యాటింగ్ లైనప్‌లు ఉన్న జట్లు నేడు ఢీకొట్టేందుకు రెడీ అయ్యాయి. అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. ఐదు గెలిచి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌తో తొమ్మిది మ్యాచ్‌లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.