చెన్నై చిదంబరం స్టేడియం వేదికగాలో సీఎస్కే తో తలపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెపాక్‌లో భారీ ఛేదనకు దిగిన లక్నో.. చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల ఛేదనలో లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (0), కేఎల్ రాహుల్ (16) వెనుదిరిగారు. ఈ క్రమంలో మార్కస్ స్టోయినిస్ సెంచరీతో విజృంభించాడు.
63 బంతుల్లో 124 పరుగుల (నాటౌట్)తో చెలరేగిపోయాడు. మరోవైపు నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34 పరుగులు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 పరుగులు (నాటౌట్)) స్టోయినిస్‌కు మంచి సపోర్ట్‌గా నిలిచారు. దీంతో చెన్నై జట్టు నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి.. 6 వికెట్లతో గెలుపొందింది లక్నో. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో ఉన్న లక్నో 4వ స్థానానికి చేరుకుంది.