ఐపీఎల్ 2024లో భాగంగా నేడు లక్నో సూపర్ జేయింట్స్‌తో హోం గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోగా.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజృభించి సెంచరీతో (నాటౌట్) ఆదుకున్నాడు. మరోవైపు బౌండరీలతో విరుచుకుపడ్డ శివం దూబే 27 బంతుల్లో 66 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో మెరిసాడు.దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టాని 210 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్‌లో ఆఖరి బంతికి అజింక్యా రహానే (1) మాట్ హెన్రీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 4 పరుగులకే తొలి వికెట్ పడిన దశలో వచ్చిన డారిల్ మిచెల్(11) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగగా.. జడేజా(16)తో కలిసి గైక్వాడ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే.. మొహ్సిన్ ఖాన్ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. ఇక ఆఖరి ఓవర్లో శివం దూబే అవుట్ కాగా, రెండు బంతులు మిగిలి ఉండగా ధోనీ ( 4 – నాటౌట్) క్రీజ్‌లోకి వచ్చాడు. ఆఖరి బంతికి బౌండరీతో ఇన్నింగ్స్‌ను పూర్తి చేశాడు.