రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం క్రిప్టో మార్కెట్‌పై పడింది. గతవారం రోజుల్లో క్రిప్టోలు 30శాతానికిపైగా రిటర్న్స్ అందించాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ మంగళవారం మూడువారాల గరిష్ఠానికి చేరుకుంది. బిట్‌కాయిన్, అవాక్స్, సోలానా, ఏడీఎ, ఎక్స్‌ఆర్‌పీ, ఎథేరియం, బీఎస్‌బీలు గత వారంరోజుల్లో 30శాతం లాభాన్నిచ్చాయి. బిట్‌కాయిన్ 42,918.77 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు గత 24గంటల్లో 40,777.90డాలర్ల వద్ద కనిష్ఠాన్ని 43,300డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. క్రిప్టోమార్కెట్ గత 24గంటల్లో 816.05బిలియన్ డాలర్లు పెరిగింది.
కాగా మంగళవారం బిట్‌కాయిన్ 4.14శాతం, ఎథేరియం 3.16శాతం, ఎక్స్‌ఆర్‌పీ 3.71శాతం, సోలానా 1.86శాతం, కార్డానో 6.14శాతం, పోల్కాడాట్ 6.35శాతం, పాలీగాన్ 2.21శాతం, షిబాఇను 2.67శాతం, యాక్సీ ఇన్ఫినిటీ 1.49శాతం లాభపడగా టెర్రా 1.73శాతం నష్టపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..