రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రిఎ్టో కరెన్సీపై పడింది. సోమవారం క్రిఎ్టో కరెన్సీలన్నీ నష్టాలబాట పట్టాయి. గ్లోబల్‌గా క్రిఎ్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గింది.ఒక్కరోజులోనే మార్కెట్ క్యాప్ 2.84శాతం తగ్గి 1.70ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిఎ్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ మార్కెట్ వాల్యూ పడిపోయిందని గ్లోబల్ క్రిప్టో ట్రాకింగ్ ప్లాట్ఫామ్ కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా వెల్లడించింది.
బిట్‌కాయిన్ సోమవారం 1.67శాతం తగ్గి 40వేల డాలర్లు దిగువకు 38,503.02 డాలర్లుగా నమోదైంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం క్రిఎ్టో కరెన్సీ పతనానికి కారణంగా అనలిస్టులు పేర్కొన్నారు. బిట్‌కాయిన్ తర్వాత రెండోస్థానంలో ఉన్న ఎథెరియం 0.73శాతం తగ్గి 2,568.89 డాలర్లుగా నమోదైందని కాయిన్‌మార్కెట్ క్యాప్ డేటా పేర్కొంది. కాగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత బిట్‌కాయిన్ తొలిసారి 40వేల డాలర్లు మార్కు దిగువకు పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..