Tuesday, November 26, 2024

భారత్‌లో క్రిప్టోకు చట్టబద్ధత లేదు: మంత్రి భగవత్‌ కరాడ్‌..

క్రిఎ్టో కరెన్సీపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్రిఎ్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదని, భవిష్యత్తులో ఈ సెగ్మెంట్‌లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుతం క్రిఎ్టో కరెన్సీలకు ఎలాంటి గుర్తింపు ఇవలేదని గుర్తు చేశారు. అందుకే దేశంలో క్రిఎ్టో కరెన్సీకి ఎలాంటి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. ఇండోర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిఎ్టో కరెన్సీపై కాంగ్రెస్‌ నాయకురాలు ఛాయా వర్మ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటి పరిస్థితుల్లో క్రిఎ్టో కరెన్సీ గురించి ఏం చెప్పలేమన్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని చెప్పుకొచ్చారు. చట్టబద్ధత చేస్తామో.. లేదో తెలీదన్నారు. భారత్‌ నుంచి చాలా మంది క్రిఎ్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారమని, దీనికి సంబంధించిన లావాదేవీలపై 30 శాతం పన్ను ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు.

బడ్జెట్‌లోనే దీన్ని నిర్ణయించామని వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల తరువాత.. ఇంధన ధరలు పెరుగుతాయా..? అన్న ప్రశ్నకు.. స్పందిస్తూ.. కేంద్రం పెట్రోల్‌, డీజెల్‌పై వరుసగా రూ.5, రూ.10 చొప్పున తగ్గించిందని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నులు తగ్గించాయన్నారు. అయితే చాలా రాష్ట్రాలు పన్నులు తగ్గించలేదన్నారు. మహా వికాస్‌ అఘాడి పాలనలో ఉన్న మహారాష్ట్రలో పెట్రోల్‌ ధర, బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో రిటైల్‌ ధరల కంటే ఎక్కువగా ఉందని కరాడ్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement