ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరి మధ్య పర్యాటకులను తిప్పేందుకు ఏర్పాటు చేసిన క్రూయిజ్ షిప్ని పుదుచ్చేరికి రాకుండా అడ్డుకున్నారు అక్కడి అధికారులు. మొన్న ఏపీ మంత్రి రోజా ఈ షిప్ని గ్రాండ్గా లాంచ్ చేశారు. అయితే ఇందులో క్యాసినో, గ్యాంబ్లింగ్ వంటివి నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ షిప్ని తమ ఏరియాలోకి రాకుండా పుదుచ్చేరి అధికారులు అడ్డుకున్నారు. ఫస్ట్ టైమ్ అడ్డుకున్న అధికారులు ఇవ్వాల రెండోసారి కూడా అట్లాగే షిప్ని రాకుండా నిలువరించారు.
ఏపీ, పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ షిప్ వివాదం కొనసాగుతూనే ఉంది. మరోసారి పుదుచ్చేరి తీరంలో నౌకను ఆపేశారు అధికారులు. అయితే దీనికి అనుమతి లేదన్నారు లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఆ షిప్లో క్యాసినో, గ్యాంబ్లింగ్ జరగడం లేదని నిర్ధారించిన తర్వాతే అనుమతంచాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండోసారి కూడా షిప్ సముద్రంలోనే ఆగిపోవాల్సి వచ్చింది.