Friday, November 22, 2024

Delhi | వివేకా హత్య కేసులో కీలక మలుపు.. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకు సునీతారెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతులను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీతారెడ్డి బుధవారం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీతో ముగించాలని సుప్రీం ఆదేశించడంతో జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

జులై 1న మళ్లీ బెయిల్‌పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఘటనలున్నాయని, సాక్షులను బెదిరించే అవకాశాలున్నాయని సునీతారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. సునీత వేసిన పిటిషన్ వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement