Friday, November 22, 2024

TG | యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి ఆదాయం రూ.11.64 లక్షలు

ప్రభన్యూస్ /యాదగిరికొండ : యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఈరోజు (శనివారం) భక్తుల రాకతో ఆలయానికి వివిధ రూపాల్లో రూ.11,64,144 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ తెలిపారు.

శ్రీ స్వామి వారి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.72,200లు, కైంకర్యములు ద్వారా రూ.1800లు, సుప్రభాతం రూ.1400 లు, బ్రేక్ దర్శనం ద్వారా రూ.44,100 లు, వ్రతాలు రూ.48వేలు, వాహన పూజలు రూ.9వేలు, విఐపి దర్శనం ద్వారా రూ.33,900లు, ప్రచారశాఖ ద్వారా రూ.9260, పాతగుట్ట రూ.6230లు, కొండపైకి వాహన ప్రవేశం రూ, 1,50,000లు, యాదఋషి నిలయం ద్వారా రూ.33,728లు వచ్చిందన్నారు.

సువర్ణ పుష్పార్చన రూ.26,400 లు, శివాలయం రూ, 2వేలు, శాశ్వత పూజలు రూ, 15 వేలు, పుష్కరిణ రూ. 1150 లు, ప్రసాదవిక్రయం ద్వారా రూ,6,47,960, లాకర్స్ ద్వారా రూ.వంద, ఇతరముల ద్వారా రూ.3116 లు, అన్నదానం ద్వారా రూ 16,800 లు వచ్చినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement