తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. టీటీడీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా… ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం లభిస్తుంది. నిన్న ఒక్కరోజే 58,379 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,950 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement