Friday, November 22, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. మొత్తం అన్ని కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. కంపార్టుమెంట్ల బయట రాంభగీచ వరకు భక్తులు క్యూ క్యూకట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

నిన్న శ్రీవారిని 64,628 మంది భక్తులు దర్శించుకోగా 41, 613 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.47 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. డీఆర్‌డీవో సంస్థ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకమ్మ మందిరం వద్ద చైర్మన్‌ను సన్మానించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలిసి లడ్డూ ప్రసాద తయారి కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement