Wednesday, November 20, 2024

కొండ‌కోన‌లు, వ‌ర‌ద‌లను దాటుకుని.. సురక్షితంగా ఆస్పత్రికి చేరిన గర్భిణులు

భూపాలపల్లి/ పలిమెల (ప్రభన్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అడవిలో ఉన్న‌ పలిమేలకు జిల్లా కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. పెద్దంపేట వాగు వద్ద వరద తాకిడికి రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మండలం లెంకెలగడ్డ, సర్వాయిపేటకు చెందిన గర్భిణులకు పురిటి నొప్పులు రావడంతో కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దీంతో స్పందించిన కలెక్టర్ భావేశ్ మిశ్రా, అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పెద్దంపేట వాగు వద్దకు చేరుకున్నారు.

వైద్య సిబ్బంది మొదట వాగు దాటి పరీక్షలు నిర్వహించిన అనంతరం లెంకలగడ్డకు చెందిన మడప పుష్పలత , సర్వాయిపేటకు చెందిన పాగే రాధిక అనే ఇద్ద‌రు గర్భిణుల‌ను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఎన్‌డీఆర్ ఎఫ్‌ బృందం, స్థానిక ప్రజలతో కలిసి వారిని సురక్షితంగా పెద్దంపేట బ్రిడ్జి దాటించి మహాదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు వారు ఆస్ప‌త్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement