Tuesday, November 26, 2024

అకాల వర్షం – అపార నష్టం..అన్నదాతలకు కన్నీళ్లే

అకాల వర్షం అపార నష్టాన్ని తీసుకొచ్చింది..మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టుగా భారీగా ఈదురు గాలులతో కురిసిన వాన అన్నదాతను నిలువునా ముంచింది..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కోలుకోలేని దెబ్బతీసింది.. మార్కెట్ లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది..తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకొని పోవడంతో రైతు దిగాలు పడుతున్నాడు

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి ..-యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరుగాలం కష్టపడి పంట చేతికందే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు, వర్షంతో అపార నష్టాన్ని తీసుకొచ్చింది.. ఎన్నో ఆశలతో వేల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రైతన్న ఆశలు అడియశాలయ్యాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షాలు రైతన్నలకు కన్నీటిని మిగిల్చాయి. భారీ ఈదురు గాలులు, వానలతో కోలుకోలేని దెబ్బతీసాయి. తమ కళ్ల ముందే వరి పంట ధాన్యం రాలిపోవడం, మార్కెట్, కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసి ముద్దాయి, తమ కళ్ళముందే కొట్టుకొని పోవడంతో కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..తమను ప్రభుత్వం ఆదుకోవాలని ధీన స్థితిలో కోరుతున్నారు.-

వరి సాగు అధికం

యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికంగా వరి పంట సాగు చేశారు. ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా వర్షం, బునాధిగాని, పిల్లాయిపల్లి, మూసి, బస్వపూర్ ప్రాజెక్టు, అత్యధికంగా వర్షం కురవడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లు పొంగిపొర్లాయి. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంట సాగు అధికంగా చేశారు. యాసంగిలో 2,85,314 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో జొన్నలు, 31 ఎకరాల్లో మొక్కజొన్న, 25 ఎకరాల్లో శనగలు, 15 ఎకరాల్లో మినుములు, 30 ఎకరాల్లో ఉలవలు, 76 ఎకరాల్లో వేరుశనగ, 10 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు

- Advertisement -

.మూడు విడతల్లో నష్టం

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మూడు విడతలుగా పంట నష్టం వాటిల్లింది.. గత నెలలో 18, 19 న, ఈ నెలలో 4న, 23,24న అకాల వర్షం, వడగండ్లు వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 30 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికి పంట నష్టం 7476 ఎకరాల్లో పంట నష్టం పరిహారం విడుదల అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement