Friday, November 22, 2024

వరదలతో దెబ్బతిన్న పంటలు.. పెరగనున్న పండ్లు, కూరగాయల ధరలు

ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రానున్న రోజుల్లో పండ్లు, కూరగాయల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా ధర రూ.300 పైకి చేరే సూచనలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటల దిగుబడి పెద్ద ఎత్తున పడిపోతోంది. ఫలితంగా టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. విత్తనాలు నాటినా, వర్షాల కారణంగా అవి పాడై పోతాయని, అందుకే రైతులు ఇప్పట్లో కొత్త పంటలు వేసే సూచనలు కన్పించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా పండ్లు, కూరగాయల ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నారు. ధరలు తిరిగి సాధరణ స్థితికి రావడానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫిసర్ సంజయ్ గుప్త ఈమేరకు వివరించారు.

ప్రస్తుతం ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేజీ టమాటా ధర రూ.200 గా ఉంది. కాలిఫ్లవర్ రూ.110, కేజీ అల్లం రూ. 370, పచ్చి మిర్చి కేజీ రూ. 230 గా ఉంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో వీటి సరఫరాకు కొరత ఏర్పడి రేట్లు పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్టాలు ఎక్కువగా టమాటాను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో మొత్తం టమాటా ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల వాటానే 91 శాతంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

- Advertisement -

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలో కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాలు సామర్థ్యానికి తగినట్లుగా టమాటాను ఉత్పత్తి చేయడం లేదు. వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గి సరఫరాకు కొరత ఏర్పుడుతోంది. దీంతో కేజీ టమాటా ధర ఆకాశాన్ని తాకుతోంది. టామాటా తక్కువ సమయంలోనే పండే పంట కావడం, ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం, అలాగే తెగుళ్ల బారినపడటం, కఠిన వాతావరణ పరిస్థితులు వంటి కారణాలు ఈ పంట దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో టమాటా పంటను కొత్త వైరస్ దెబ్బతీసింది. ఫలితంగా టమాటా దిగుబడి తగ్గి ధర భారీగా పెరుగుతోంది.

కాగా అంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాను కొనుగోలు చేయాలని ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్ సీసీఎఫ్ కు కేంద్రం సూచించింది. సాధారణంగా జులై, ఆగస్టు, అక్టోబర్ నవంబర్ సీజన్ లో టమాటా దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంతో ఈ సీజన్లో ధరలు భారీగా పెరుగుతాయి. ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటా ధరను డిస్కౌంట్ తో తక్కువ ధరకే విక్రయించే ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా ధర రూ. 300 పైకి చేరే సూచనలు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటల దిగుబడి భారీగా పడిపోతోంది. ఫలితంగా టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

విత్తనాలు నాటినా వర్షాల కారణంగా అవి పాడై పోతాయని, అందుకే రైతులు ఇప్పట్లి కొత్త పంటలు వేసే సూచనలు కన్పించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా పండ్లు, కూరగాయల ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నారు. ధరలు తిరిగి సాధరణ స్థితికి రావడానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫిసర్ సంజయ్ గుప్త ఈమేరకు వివరించారు.

ప్రస్తుతం ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేజీ టమాటా ధర రూ. 200 గా ఉంది. కాలిఫ్లవర్ రూ. 110, కేజీ అల్లం రూ. 370, పచ్చి మిర్చి కేజీ రూ. 230 గా ఉంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో వీటి సరఫరాకు కొరత ఏర్పడి రేట్లు పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్టాలు ఎక్కువగా టమాటాను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో మొత్తం టమాటా ఉత్పత్తిలో ఈ రాష్ట్రాల వాటానే 91 శాతంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలో కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాలు సామర్థ్యానికి తగినట్లుగా టమాటాను ఉత్పత్తి చేయడం లేదు. వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గి సరఫరాకు కొరత ఏర్పుడుతోంది. దీంతో కేజీ టమాటా ధర ఆకాశాన్ని తాకుతోంది. టామాటా తక్కువ సమయంలోనే పండే పంట కావడం, ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం, అలాగే తెగుళ్ల బారినపడటం, కఠిన వాతావరణ పరిస్థితులు వంటి కారణాలు ఈ పంట దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో టమాటా పంటను కొత్త వైరస్ దెబ్బతీసింది. ఫలితంగా టమాటా దిగుబడి తగ్గి ధర భారీగా పెరుగుతోంది.

కాగా అంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి టమాటాను కొనుగోలు చేయాలని ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్ సీసీఎఫ్ కు కేంద్రం సూచించింది. సాధారణంగా జులై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్ సీజన్ లో టమాటా దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంతో ఈ సీజన్లో ధరలు భారీగా పెరుగుతాయి. ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటా ధరను డిస్కౌంట్ తో తక్కువ ధరకే విక్రయించే ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement