నకిలీ విత్తనాలతో 60 ఎకరాల మొక్కజొన్న పంట నష్టపోయిన రైతుల ఉదంతమిది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట రైతులు ఓ కంపెనీకి చెందిన మొక్కజొన్న సీడ్స్ కోసం సాగు చేశారు. ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల సాగు వస్తుందని కంపెనీ ప్రతినిధులు నమ్మబలకడంతో గ్రామానికి చెందిన రైతులు 60 ఎకరాల్లో సాగుచేశారు. అయితే మొక్కజొన్న కంకి మూడు ఇంచులు మాత్రమే పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో ఎకరానికి ఇప్పటికే 40 వేలకు పైగా బడి పెట్టామని రైతులు లబోదిబోమంటున్నారు.
సోమవారం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్ రెడ్డి, సుల్తానాబాద్ మండల తెరాసా పార్టీ అధ్యక్షులు ప్రేమ్ చందర్ రావు తో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి కి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సదరు కంపెనీ నుండి నష్టపరిహారం అందించాలని వేడుకోవడం తో స్పందించిన వ్యవసాయ అధికారి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..