నదులు, చెరువుల వద్ద సంచరించే మొసలి.. ఓ గ్రామంలో ప్రత్యక్షమైంది. గ్రామాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారిలా గ్రామంలోని వీధులు తిరుగుతూ పరిశీలించింది. ఈ సంఘటన కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలో జరిగింది. గ్రామంలోకి మొసలి రావడంతో గ్రామస్తులు పరుగులు తీశారు. మొసలి మాత్రం దర్జాగా తిరుగుతూ చుట్టూ పరిశీలిస్తూ వెళ్లింది. సుమారు అరగంటపాటు మొసలి గ్రామంలో సంచరించింది. భయపడిన గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు వచ్చి మొసలిని పట్టుకొని నదిలో వదిలేశారు. ఈ గ్రామానికి దగ్గరలో కాలీ నది ఉన్నది. అక్కడి నుంచే ఈ మొసలి వచ్చి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ముసలి మాత్రం ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేదు. భారీ ఆకారంలో ఉన్న మొసలి రోడ్డుపై నడుస్తూ ఉంటే అందరూ ఇళ్ల తలుపులు మూసేసుకుని లోపలే ఉండిపోయారు. దీంతో కాలనీ నిర్మానుష్యంగా మారిపోయింది. కొందరు మాత్రం మొసలి వెంట నడుస్తూ దానిని కెమేరాలో బంధించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: సిరిసిల్ల పర్యటనకు సీఎం కేసీఆర్!