ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాక్ జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ వార్తతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయన కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
చాలా కాలంగా..జాకీర్ హుస్సేన్ సన్నిహిత మిత్రుడు, ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా ఆయన గత వారం గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జాకీర్ హుస్సేన్ చాలా కాలంగా రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు జర్నలిస్ట్ పర్వేజ్ ఆలం కూడా జాకీర్ హుస్సేన్ చిత్రాన్ని పంచుకుని ఈ విషయాన్ని ప్రకటించారు.
జాకీర్ హుస్సేన్ …
73 ఏళ్ల జాకీర్ హుస్సేన్ ఆయన చిన్న తనంలో 7 సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించాడు. 11 సంవత్సరాల వయస్సులో జాకీర్ హుస్సేన్ వివిధ ప్రదేశాలలో తన నైపుణ్యాలను ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో పేరు అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు సంపాదించాడు. క్రమంగా జాకీర్ హుస్సేన్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతోపాటు జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు.