గూడూరు, ప్రభన్యూస్: సాంకేతిక పరిజ్ఞానంతోనే నేర పరిశోధన సులభమవుతుందని అడిషనల్ డీజీపీ వై. నాగిరెడ్డి అన్నారు. బుధవారం మహబుబాద్ జిల్లా గూడూరు మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన అడిషనల్ డీజీపీ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌తో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ప్రాంతాన్ని పరిశీలించి రిసెప్షన్, రైటర్ రూమ్, ఫైళ్ళను భద్రపరిచే ర్యాక్, ఎస్సై రూమ్, విశ్రాంత గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం పోలీస్ అధికారులు, సి బ్బందితో నేరాల సాంకేతిక నివేదికను అడిగి పలు రికార్డులను పరిశీలించారు. ఫైఎస్ ఫంక్షన్ వర్టికల్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ, రిసెప్షని స్టు, ఈక్యాప్, బ్లూకోర్ట్, పెట్రోకార్ పలు అంశాలపై నేరుగా సి బ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అడిషనల్ డీజీపీ నాగి రెడ్డి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది పనితీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని, రోజురోజుకు మావోయిస్టులు ప్రజాధారణ కోల్పోయారన్నారు. పోలీసులు సైతం ప్రజల మన్ననలను పొంది ఒక రోల్‌మోడల్‌గా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ యాసిన్, బయ్యారం సీఐ బాలాజీ, గూడూరు, కొత్తగూడ ఎస్సైలు సతీష్‌గౌడ్, నగేష్, దిలీప్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.