Friday, November 22, 2024

Crimilal Profile: డ్రగ్స్‌ కట్టడికి కొత్త సాఫ్ట్‌ వేర్‌.. అన్ని స్టేషన్లలో నేరస్తుల డేటా!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నేరస్థులను కట్టడి చేయ డానికి తెలంగాణ పోలీసులు డ్రగ్స్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌ అనాలిసిస్‌ అండ్‌ మాని టరింగ్‌ (డోపమ్స్‌ – డివోపిఏఎంఎస్‌) సాఫ్ట్‌ వేర్‌ను రూపొం దించారు. డోపమ్స్‌ సాఫ్ట్‌ వేర్‌ ద్వారా నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్స్‌ (ఎన్‌డి పిఎస్‌) కేసుల ప్రొఫైలింగ్‌, మానిటరింగ్‌, విశ్లేషణ కోసం డోపమ్స్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలంగాణ పోలీస్‌ శాఖ తెలిపింది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో కేసు రిజిస్టర్‌ చేసి, అరెస్టు చేసిన నేరస్థుల సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందు బాటులోకి తీసుకురావడంతో ఈ సాఫ్ట్‌ వేర్‌ కీలకంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు తమకు అవసరమైన సమాచా రాన్ని సులభంగా పొందవచ్చు.

డ్రగ్స్‌ నేరస్థుల వివరాలను ఎప్పటి కప్పుడు డోపమ్స్‌లో నిక్షిప్తం చేస్తారు. నేర ప్రవృతి కలిగి, బహుళ నేరాల కు పాల్పడే పాత నేరస్థుల నేరాల చిట్టా, వారు నేరాలకు పాల్పడుతున్న ప్రాంతం, డ్రగ్స్‌ రకం ఆధారంగా నేరస్థులను గుర్తించడానికి డోపమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. అలాగే మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్‌స్పాట్‌లను సులభంగా గుర్తించవచ్చు. డ్రగ్స్‌ కేసులు విచా రిస్తున్న అధికారులకు దర్యాప్తుకు అవసరమైన రాష్ట్ర వ్యాప్త ంగానూ, ఇతర రాష్ట్రా ల్లోని డ్రగ్స్‌ నేరస్థుల సమాచారం డోపమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఎన్‌డిపిఎస్‌ కేసుల పర్యవేక్షణకు వేదిగా డోపమ్స్‌ నిలుస్తుందని రాష్ట్ర పోలీస్‌ శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement