Saturday, November 23, 2024

Crimes: మ‌హాన‌దిలో ప‌డ‌వ మున‌క – ఎనిమిది మంది మృతి

ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఝర్సుగూడ జిల్లాలోని మహానదిలో పడవ బొల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. బర్‌గఢ్ జిల్లా బందుపాలి ప్రాంతం నుంచి ప్రయాణికులతో వస్తున్న పడవ మార్గమధ్యంలో ఝర్సుగూడలోని శారదా ఘాట్ దగ్గర బోటు బోల్తా పడింది. నది దాటుతుండగా పడవలో నీరు చేరడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఈ పడవలో 57 మంది ప్రయాణికులున్నారు. 48మందిని సురక్షితంగా కాపాడారు. ఎన‌మిది మృత‌దేహాల‌ను వెలికితీశారు.. . గల్లంతైన వారి కోసం పోలీసులు, డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.

జైలులో ఖైదీల మ‌ధ్య ఫైటింగ్.. ఇద్ద‌రు మృతి.. మ‌రో ఇద్ద‌రికి గాయాలు..
పంజాబ్ లోని సంగ్రూర్ లో ఘ‌ట‌న…
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ‌త అర్థరాత్రి దాటిన త‌ర్వాత ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్ట‌ర్ – ట్ర‌క్ ఢీ… న‌లుగురు మ‌హిళ‌లు మృతి.. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న..
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మెయిన్‌పురిలోని భోగావ్‌లో ఇవాళ‌ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, 24మంది గాయపడినట్లు సమాచారం. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ట్రక్కు ఢీకొన్నట్లు సమాచారం. నామకరణ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న స్త్రీలు, పురుషులు ట్రాలీలో ఉన్నారు. దారిలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో కూర్చున్న ఫూల్మతి, రమాకాంతి, సంజయ్ దేవి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా 25మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, ద్రౌపదీ దేవి కూడా మృతిచెందింది. మృతులు, గాయపడిన వారంతా కున్వర్‌పూర్ ఛిబ్రామౌ గ్రామ నివాసితులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దారుణం ..
భార్య తన భర్తను కడతేర్చింది. ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య తన మామ సహకారంతో అతడిని కిరాతకంగా హత్య చేసింది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో విచక్షణ కోల్పోయి అతడిని అంతమెుందించింది. వెదుళ్లవలసకు చెందిన కొలుసు అప్పన్న, దేవి ఇద్దరు భార్యాభర్తలు. తాగుడుకు బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఆమెపై అనుమానంతో వేధింపులకు పాల్పడేవాడు. దీంతో కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఆ ఇల్లాలు. ఇందుకు మామ కూడా స‌హ‌క‌రించాడు.. పోలీసులు ఇద్ద‌ర్ని ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌రలించారు.

అస్వస్థత‌కు గురైన కేజీబీవీ విద్యార్థులను పరామ‌ర్శించిన డీసీసీ అధ్యక్షులు
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు శనివారం ఆసుపత్రిలో ఉదయం పరామ‌ర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను విజ్ఞప్తి చేశారు. అస్వస్థత‌కు గురైన విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీహరి వెంట నర్సాపూర్ (జి) పార్టీ మండల అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు ఉమ మహేశ్వర్, అజీమ్, నయన్నగారి మురళి, మనోజ్ యాదవ్, గాజుల రవి కుమార్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement