Friday, November 22, 2024

Crime | అప్పు తీర్చలేదని అక్కచెల్లెళ్లను కాల్చి చంపారు.. ఢిల్లీలో ఘటన

రూ.10 వేల రూపాయల అప్పు తిరిగి రాబట్టడం కోసం ఇద్దరు అక్కచెల్లెళ్ళను కాల్చి చంపిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు చెప్పినదాన్ని బట్టి దాదాపు 15 నుంచి 20 మంది సాయుధులైన వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకు నైరుతి ఢిల్లిలోని ఆర్‌కే పురంలో అంబేద్కర్‌ బస్తీకి చేరుకున్నారు. ఒక ఇంటి తలుపు తట్టారు. ఇంటిపై ఇటుకలతో దాడి చేశారు. రాళ్ళు రువ్వడం ప్రారంభించారు.

- Advertisement -

దీంతో ఇంటి యజమాని లలిత్‌ తలుపు తీసుకొని బైటకు వచ్చి విషయం ఏమిటని వాకబు చేస్తుండగా దుండగుల్లో కొందరు ఉన్నట్టుండి కాల్పులు జరపడం ప్రారంభించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అక్కా చెల్లెళ్లు పింకీ(30), జ్యోతి(29)ని ఎస్‌జే ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ వారు మరణించారు.

వెంట్రుక వాసిలో కాల్పుల నుంచి తప్పించుకున్న లలిత్‌.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దేవ్‌ అనే స్థానిక వ్యక్తితో తనకు గొడవలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు అర్జున్‌, మైఖేల్‌, దేవ్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్టు నైరుతి ఢిల్లి పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ సీ మనోజ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement