Friday, November 22, 2024

విశాఖ‌లో క్రైమ్ రేట్ త‌గ్గింది : ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్‌

విశాఖలో క్రైమ్ రేట్ తగ్గింద‌ని, లోక్ అదాలత్ లో 47 వేల ఎఫ్ ఐఆర్‌ కేసులు పరిష్కరించడం జరిగిందని ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ అన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి. సుమారు 1,500 కేసుల్లో 1,30,000 కేజీల గంజాయి పట్టుకున్నామన్నారు. ఉడా చిల్డ్రన్స్ ఎరినా థియేటర్ లో జిల్లా పోలీస్ యంత్రాంగంతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏఓబీలో మావోయిజం యాక్టివ్ లో ఉంద‌న్నారు. సైబర్ కేసులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ను మరింత అప్ గ్రేడ్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. పోలీసులు రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. అనంత‌రం అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాశ్ మాట్లాడుతూ… అలిపిరి పీఎస్ పరిధిలో భక్తుల ముసుగులో గుర్తు తెలియని వ్యక్తులు అధికంగా ఉంటారు కాబ‌ట్టి అక్క‌డి సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. గతంతో పోల్చితే అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు తగ్గాయి. తిరుపతి సిటీలో నేరాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎవ‌రైనా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తే వెంట‌నే 100 కి కాల్ చేసి తెల‌పాల‌ని, 5 నిమిషాల్లో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement