మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యను రాజస్థాన్ తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేశాడు. ఆ తర్వాత ఎంచక్కా తిరిగి సొంతూరుకు చేరుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.
రాష్ట్రంలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్ రాణాకు మూడు నెలల క్రితం సురేకెలకు చెందిన రేవతితో పెళ్లైంది. ఆ తర్వాత ఉపాధి కోసం భార్యను తీసుకుని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు.
కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత సరోజ్‌రాణా తన భార్య రేవతిని ఓ కుటుంబానికి లక్షల రూపాయలకు అమ్మేసి సొంతూరు తిరిగి వచ్చేశాడు. రేవతి గురించి ప్రశ్నించిన అత్తమామలకు.. ఆమె వేరే యువకుడితో వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు.
అల్లుడి తీరుపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని అసలు బాగోతం బయటపడ్డది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజస్థాన్ చేరుకుని రేవతిని రక్షించి తీసుకొచ్చారు. సరోజ్‌ను అరెస్ట్ చేశారు.
అయితే, భర్త తనను అమ్మేసిన విషయం తెలియదని, ఓ ఇంట్లో పనిచేయాలని చెప్పి వెళ్లిపోయాడని రేవతి చెప్పడం గమనార్హం.