Saturday, January 18, 2025

Crime l నార్సింగ్ లో జంట దారుణ హత్య

హైదరాబాద్ – నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.

వివరాల్లోకి వెళ్తే.. పుప్పాలగూడలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ సమీపంలోని గుట్టపై కొంతమంది పతంగులు ఎగురవేయాడానికి వెళ్లారు. ఈ క్రమంలో మృతదేహాలను గుర్తించారు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

- Advertisement -

మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. నానక్‌రాం గూడ హనుమాన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటు్న అంకిత్ సాకేత్.. హౌజ్ కీపింగ్‌గా పని చేస్తున్నాడు. మృతుడి మృతదేహానికి 60 మీటర్ల దూరంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ఘటన స్థలంలో బైక్ తాళాలు స్వాధీనం చేసుకున్నారు. బైక్ ట్రేస్ అవుట్ అయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు 30 నుండి 32 ఏండ్ల వయసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. మహిళ వివరాలను పోలీసులు సేకరించారు. మృతురాలు బిందు (25) చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన మహిళాగా గుర్తించారు పోలీసులు. అంకిత్ సాకేత్‌తో సన్నిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈనెల 8వ తేదీన మృతుడు అంకిత్‌ ఎల్‌బీ నగర్‌ నుంచి నానక్‌రామ్ గూడకు తీసుకొచ్చి స్నేహితురాలి గదిలో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. 11వ తేదీ రాత్రి హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement