ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో 18మందికి గాయాలైన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. నూతన సంవత్సరం మొదటి రోజే జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన పలాజు జిల్లాలోని హరిహర్ గంజ్ వద్ద చోటుచేసుకుంది. న్యూ ఇయర్ రోజున ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. పాలం జిల్లాలోని పంకికి చెందిన కార్మికులు పొరుగున ఉన్న బీహార్‌లోని సిహుడి గ్రామంలో వరి కోత తర్వాత తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital