Friday, November 22, 2024

Crime and Punishment – మైన‌ర్ పై బిజెపి ఎమ్మెల్యే అత్యాచారం – 25 ఏళ్ల జైలు శిక్ష‌…

లక్నో: అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు నేడు శిక్షలు ఖరారు చేసింది. 25 ఏళ్లు శిక్ష ఖ‌రారు కావ‌డంతో ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వి ర‌ద్దు కానుంది..

వివ‌రాల‌లోకి వెళితే
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా దుద్ది నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్ ఏడాదిగా తనపై లైంగిక దాడులకు పాల్పడినట్లు 15 ఏళ్ల బాలిక 9 ఏళ్ల కిందట ఆరోపించింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో 2014 నవంబర్‌ 4న రాందులర్ గోండ్‌పై ఐపీసీతోపాటు పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పుడు రాందులర్ గోండ్‌ ఎమ్మెల్యే పదవిలో లేరు. అయితే ఆయన భార్య సూర్తన్‌ దేవి గ్రామ సర్పంచ్‌గా ఉన్నది. 2018లో రాందులర్‌ బీజేపీలో చేరారు. 2022లో దుద్ది అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆయనపై నమోదైన అత్యాచారం కేసు ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎహసాన్ ఉల్లా ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను దోషిగా ఈ నెల 12న నిర్ధారించారు. శుక్రవారం శిక్షలు ఖరారు చేస్తూ 25 ఏళ్లు జైలు శిక్ష విధించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement