Friday, November 22, 2024

లీగ్ ల నుంచి క్రికెట్ ను కాపాడుకోవాలి….

న్యూఢిల్లి : ప్రస్తుతం అనేక లీగ్‌లు నడుస్తున్నాయి. అన్నింటి కంటే టీ 20 లీగ్‌ హవా నడుస్తోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బిగ్‌బాష్‌ లీగ్‌, దక్షిణాఫ్రికా లీగ్‌ ఇలా అనేక ఫ్రాంచైజీ క్రిికెట్‌తో ఆటగాళ్లకు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ తరహా లీగ్‌ ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం పడుతుందని చాలా కాలంగా ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరిల్బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కూడా ఇదే అంశంపై స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకొ వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇందుకోసం ఐసీసీ తక్షణమే స్పందించాలని కోరింది. లేకుంటే భవిష్యత్‌ ప్రణాళిక కార్యాచరణ (ఎఫ్‌టీపీ)పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని తెలిపింది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న సమావేశం ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేసింది.

‘ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ పెరుగుతోంది. దీని వల్ల అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూలింగ్‌కు కూడా ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. దీనిపై తక్షణమే క్రికెట్‌ ప్రపంచం స్పందించాలని ఎంసీసీ కోరింది. తక్కువ సమయంలో ముగిసే ఫ్రాంచౖౖెజీ టోర్నీలతో ఇప్పుడ క్రికెఎట్‌ భవిష్యత్‌ షెడ్యూలింగ్‌ నిండిపోయిందని పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌ ను ఎలా కాపాడుకోవాలి, రానున్న పదేళ్ల కాలంలో అంటర్నేషనల్‌ క్రికెట్‌ను ఎలా డెవలప్‌ చేయాలో దుబాయ్‌ సమావె శంలో చర్చించినట్లు తెలిపింది. 2023 క్రికెట్‌ షెడ్యూల్‌ చూస్తే ఎక్కువ భాగం ఫ్రాంచైజీ క్రికెట్‌కే చోటు దక్కిందని తెలిపింది. దీని వల్ల చిన్న దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లకు స్థానం లేకుండాపో యిందని, ఇక మహిళల ఎఫ్‌టీపీ మాత్రం చాలా స్పష్టంగా ఉందని, అంతర్జాతీయ క్రెకెట్‌ను దేశీయ లీగ్‌లు అతిక్రమించలేదని పేర్కొంది.
టెస్ట్‌ క్రికెట్‌ అసలైన గేమ్‌ అని తాను ఇప్పటికీ నమ్ముతున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ చె ప్పారు. క్రికెట్‌ వ్యాప్తికి ఇదే పెద్ద ప్లాట్‌ఫామ్‌ అని చెప్పారు. గొప్ప ఆటగాళ్లుగా అవిష్కరించుకునే అవకాశం ఆటగాళ్లకు లభిస్తుంద న్నారు. టెస్ట్‌ క్రికెట్‌కు, ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్‌కు మధ్య బ్యాలెన్స్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీసీ నియమించిన వరల్డ్‌ క్రికెట్‌ కమిటీ (డబ్ల్యూసీసీ ) సభ్యుల్లో గంగూలీ కూడా సభ్యుడుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement