మెల్ బోర్న్ – బోర్డర్-గవాస్కర్ టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ పేస్ ఆల్‌రౌండర్‌గా టీంలోకి వచ్చిన అతడు.. నాలుగో టెస్ట్‌లో టీమిండియాను ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈ క్రమంలోనే టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. సెంచరీ సాధించడంతో స్టాండ్స్‌లో ఉన్న అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు లేచి నిలబడి చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట ఆనందబాష్పాలు వర్షించాయి.. నితీష్ 90 పరుగులు చేసిన తరణం నుంచి ఆయన తన కుమారుడు శతకం చేయాలని దేవుడిని కోరుతూ ప్రతి బంతికి నమస్కారం చేయడం విశేషం.. శతకం ఆనంతరం టివి కామెంటేటర్ అతడిని ఇంటర్య్యూ చేశాడు.. బ్యాటింగ్, బౌలింగ్ లో తన కుమారుడు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎంతో కృషి చేశాడని చెప్పాడు.
కాగా, 171 బంతుల్లో ఈ రికార్డును అందుకున్న నితిష్.. ఎనిమిదో స్థానంలో వచ్చి ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కుంబ్లే (87) పేరిటా ఉంది.
ఇక ఈ టెస్ట్ లో నితీశ్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు బీజీటీ సిరీస్‌లో ఈ యంగ్ ప్లేయర్ మొత్తం 8 సిక్సర్లు బాదాడు. దీంతో ఆస్ట్రేలియాలో సింగిల్ సిరీస్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లండ్ ప్లేయర్ మైఖేల్ వాన్, కరేబియన్ ఆటగాడు క్రిస్ గేల్ సరసన నితీశ్ రెడ్డి చేరాడు. ఆస్ట్రేలియాలో 2002-03 యాషెస్ సిరీస్ లో వాన్ 8 సిక్సులు కొట్టగా, 2009-10 ఆసీస్ పర్యటనలో గేల్ కూడా 8 సిక్సులే నమోదు చేశాడు. .