ఒలింపిక్స్‌లో క్రికెట్ అధికారికంగా చోటు దక్కించుకుంది. 123 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028 ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్ భాగమైంది. క్రికెట్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ వంటి క్రీడలు కూడా ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ ప్రతిపాదనలు జారీ చేయగా.. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్లో ఆమోద ముద్రవేశారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిపాదనలు చేసింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement