మనదేశం క్రీడా హాకీ అయినప్పటికి.. క్రికెట్ కే ఎక్కువ ఆదరణ. అంతేకాదు క్రికెట్ ఆట ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఇప్పటి వరకు ఇంత ఆదరణ కలిగిన క్రికెట్ కి ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం లేదు.. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఇది కార్యరూపం దాల్చడడం లేదు. గతంలో 1900లో పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ అనంతరం దానిని కొనసాగించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
కాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) తో ఐసీసీ చర్చలు జరిపింది. అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు అంగీకారం తెలపలేదు. కానీ ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎనిమిది టీమ్‌ల మధ్య పోరు ఉండనున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఫార్మట్ విషయానికొస్తే టీ 20 లేదా టీ 10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి జావెలిన్ త్రో..