Friday, November 22, 2024

Cricket – ఇంగ్లండ్ ను 218 ప‌రుగుల‌కు కుప్ప‌కూల్చిన స్పిన్ త్ర‌యం…

ధ‌ర్మ‌శాల‌లో నేడు ప్రారంభమైన చివ‌రి టెస్ట్ లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగుల‌కు కుప్ప‌కూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కు భార‌త స్పిన్న‌ర్లు చుక్క‌లు చూపించారు.. స్పీన్ త్ర‌యం అశ్విన్, కుల‌దీప్,జ‌డేజ్ లు మొత్తం ప‌దివికెట్లు ప‌డ‌గొట్టారు.. క్రాలే ఒక్క‌డే 79 ప‌రుగుల‌తో ఇంగ్లండ్ ప‌త‌నాన్నిఅడ్డుకున్నాడు.. జోరూట్ 26, డంకెట్ 27, బ్రిస్టో 29 ప‌రుగులు చేశారు. మిగిలిన బ్యాట‌ర్స్ విఫ‌ల‌మ‌య్యారు.. ఇక ఈ మ్యాచ్ లో కుల‌దీప్ అయిదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ కు నాలుగు వికెట్లు ద‌క్కాయి..జ‌డేజా ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు..

దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ఆరంగేట్రం..

దేవదత్ పడిక్కల్ ఈ సిరీస్‌లో భారత జట్టులో తన అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఐదవ భారతీయ ఆటగాడు. చీలమండ గాయం కారణంగా రజత్ పాటిదార్ ప్లేయింగ్ 11కి దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో దేవదత్ పడిక్కల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

కుల్దీప్ స‌రికొత్త చ‌రిత్ర ..
టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ . బెన్‌ డకెట్‌(27), జాక్‌ క్రాలే(79), ఒలీ పోప్‌(11) రూపంలో టాపార్డర్‌ వికెట్లన్నీ తానే దక్కించుకున్న కుల్దీప్‌.. మిడిలార్డర్‌ బ్యాటర్లు జానీ బెయిర్‌ స్టో(29), బెన్‌ స్టోక్స్‌(0)లను కూడా అవుట్‌ చేశాడు.
కాగా స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపిన సందర్భంగా కుల్దీప్‌ యాదవ్‌ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున తక్కువ బంతుల్లోనే 50 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌లను ఈ చైనామన్‌ బౌలర్‌ అధిగమించాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 275 వికెట్ల మైలురాయిని అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌.. ఈ మార్కుకు చేరుకున్న పదిహేడో భారత బౌలర్‌గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement