Saturday, November 23, 2024

బార్ ,రెస్టారెంట్‌లో బెట్టింగ్ జోరు.. 64 వేల 250 నగదు స్వాధీనం

వరంగల్ క్రైమ్, ప్రభన్యూస్ : ఓరుగల్లులో ఐపిఎల్ క్రికెట్ పై బెట్టింగ్స్ జోరందుకొన్నాయి. చాటుమాటుగా సాగే క్రికెట్ బెట్టింగ్స్ కాస్తా బహిరంగంగా మారింది. వరంగల్ నగరంలోని బార్, రెస్టారెంట్‌లో క్రికెట్ బెట్టింగ్‌ కాస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 5 గురు బెట్టింగ్ రాయుళ్లను టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.సంతోష్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. వారి నుండి 64 వేల 250 రూపాయల నగదును, 6 మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ సీజ్ చేశారు.

ఐపిఎల్ క్రికెట్ పై బెట్టింగ్స్ సాగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సంతోష్ కు పక్కా సమాచారం అందుకొన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని రిషి బార్ అండ్ రెస్టారెంట్లో టీవీలు చూస్తూ,బెట్టింగ్స్ కాస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. వరంగల్ కాశిబుగ్గలోని వివికానంద కాలనీకి చెందిన పగడాల ప్రశాంత్(25), స్టేషన్ ఘన్ పూర్ మండలం చిన్న పెండ్యాల,నష్కల్ కు చెందిన గాధే విశ్వ (22),కొరివిప్రణయ్(22), మానుకో శ్రీకాంత్ (27),కరుణపురం కు చెందిన మట్టెడ మనోహర్(27)లతో పాటు మహేందర్( రిషి బార్ అండ్ రెస్టారెంట్ యజమాని) లను అరెస్ట్ చేశారు. తదుపరి చట్ట పరమైన చర్యల కోసమై ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement