Friday, November 22, 2024

Cricket Awards – మ‌రికొన్ని గంట‌ల‌లో బీసీసీఐ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వం….

హైద‌రాబాద్ – ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ అవార్డ్స్ కార్యక్రమం మరికొద్ది గంట‌ల‌లో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుండగా.. కొద్దిసేపటి కిందట శంషాబాద్ విమానాశ్రమానికి బీసీసీఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చేరుకున్నారు. వీరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌రావు స్వాగతం పలికారు.

భాగ్య నగరానికి బీసీసీఐ పెద్దలు హాజరుకావడంతో హైదరాబాద్ క్రికెట్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ వేడుక గత మూడు సంవత్సరాలుగా జరగలేదు. బీసీసీఐ అవార్డుల కార్యక్రమం చివరిసారిగా 2020 జనవరిలో ముంబై వేదికగా జరిగింది. 2018-19 క్రికెట్ ఏడాదికి అత్యుత్తమ ఆటగాళ్లకు అవార్డులు ఇచ్చింది. పురుషుల జట్టులో జస్‌ప్రీత్ బూమ్రా, మహిళల జట్టులో పూనమ్ యాదవ్‌లకు అవార్డు దక్కింది.

కాగా, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. బీసీసీఐ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2023 అవార్డుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో నేడు జరిగే వార్షిక అవార్డుల కార్యక్రమంలో గిల్‌కు బోర్డు ఈ పురస్కారాన్ని అందజేయనుంది. ఇక మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ‘లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు అందుకోనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement