Thursday, November 21, 2024

క్రీమ్ మూవీ షూటింగ్-తీవ్ర గాయాల‌పాలైన హీరోయిన్

మూవీ షూటింగ్స్ లో న‌టీ న‌టుల‌కి గాయాలు కావ‌డం మామూలే. కాక‌పోతే ఒక్కోసారి బ‌ల‌మ‌యిన గాయాలు కూడా అవుతుంటాయి. హీరోయిన్ సంయుక్త హెగ్డేకి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని సోష‌ల్ మీడియాలో తెలిపింది ఈ బ్యూటీ.ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న కన్నడ మూవీ క్రీమ్ షూటింగ్‌లో భాగంగా ఫైట్ సీన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా రౌడీలను కొట్టే సందర్భంలో స్టంట్ చేసే క్రమంలో ఆమె కాలికి గాయమైంది. వెంటనే ఆమెను మూవీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.తన మోకాలి దగ్గర బలమైన గాయం అయిందని చెప్పింది సంయుక్త హెగ్డే. డాక్టర్స్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి బోర్డ్ గేమ్స్ ఆడుతున్న చెప్పింది. తనకు గాయమైనా.. మూవీ రిలీజ్ అయిన తరువాత ఆ ఫైట్ సీన్ చూసి తనను మెచ్చుకుంటారంటూ చెప్పుకొచ్చింది ఈ కన్నడ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను, మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement