Wednesday, November 20, 2024

గోవా స‌భ‌ల్లో కేజ్రీవాల్..తీర్థ‌యాత్ర‌లు ప్రీ ..

గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ మేర‌కు ఆయ‌నో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించారు. గోవాలోని హిందువులను అయోధ్య రామాలయానికి, క్రైస్తవులను వేలాంకినికి, ముస్లింలను రాజస్థాన్‌లోని అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాకు, సాయిబాబాను కొలిచే భక్తులను షిర్డీ యాత్రకు ఉచితంగా తీసుకెళతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారాయ‌న‌. గోవాలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అన్నారు.

గోవాలోని అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా గతంలోనూ ఎన్నో హామీలు కురిపించారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా ప్రచారంలోకి దిగి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గోవాలో నిర్వహించిన పలు సభల్లో పాల్గొన్న కేజ్రీవాల్‌.. రాష్ట్రంలో ఆప్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ప్రజలను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళతామని హామీ ఇవ్వ‌డం వైర‌ల్ గా మారింది. ప‌ద‌వుల‌కోసం రాజ‌కీయ నేత‌లు ఎలాంటి ప‌థ‌కాల‌నైనా అమ‌లు చేస్తార‌ని ప్ర‌జలు అనుకుంటున్నారు. అయినా ఆమ్ ఆద్మీ నేత‌కి ఇవేం ప‌ట్ట‌వుగా.

Advertisement

తాజా వార్తలు

Advertisement