భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అతిపెద్ద యాక్షన్ డ్రామా ఫ్రాంచైజీలో KGF ఒకటి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ సినిమాలు భారత సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా నుంచి త్వరలోనే మూడో భాగం కూడా రానుంది. యష్ నటించిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
తాజా అప్డేట్ ఏమిటంటే.. ప్రశాంత్ నీల్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ ల లైనప్ ని క్లియర్ చేసిని వెంటనే KGF 3ని బోర్డ్ మీదకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత జూ.ఎన్టీయార్ తో #NTR31 ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు. ఈ లైనప్ పూర్తి అయిన తర్వాత నీల్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ KGF–3 అని తెలుస్తోంది. KGF–3 ని 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ హై యాక్షన్ డ్రామా ఫ్రాంచైజీకి సింభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.