Friday, November 22, 2024

స్మార్ట్ ఫోన్ ల‌వ‌ర్స్‌కి క్రేజీ అప్‌డేట్‌.. వ‌న్ ప్ల‌స్ 11 5జీ రిలీజ్ అయ్యిందోచ్‌!

వన్‍ప్లస్ నయా ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చేసింది. వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ఇండియాలో ఇవ్వాల (జనవరి 7) లాంచ్ అయ్యింది. క్లౌడ్ 11 ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‌ని రిలీజ్ చేశారు. 2కే రెజల్యూషన్ అమోలెడ్ డిస్‍ప్లే, హాసెల్‍బ్లేడ్ ప్రీమియమ్ కెమెరాలు, శక్తివంతమైన స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వన్‍ప్లస్ 11 5జీ వస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

- Advertisement -

OnePlus 11 5G స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలు ఇక్కడ చూడండి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, నాలుగు ఓఎస్ అప్‍డేట్లు

ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.0తో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‍కు నాలుగు ఓఎస్ అప్‍డేట్లు ఇవ్వనున్నట్టు వన్‍ప్లస్ పేర్కొంది. అంటే ఆండ్రాయిడ్ 17 వరకు అప్‍డేట్లు వస్తాయి. ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‍డేట్లను ఈ ఫోన్ అందుకుంటుంది.

క్వాడ్ హెచ్‍డీ+ రెజల్యూషన్ డిస్‍ప్లే..

6.7 ఇంచుల 2కే క్వాడ్ హెచ్‍డీ+ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‍ప్లేతో వన్‍ప్లస్ 11 5జీ మొబైల్ వస్తోంది. 120 హెర్ట్జ్ (Hz) అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఎల్‍టీపీవో 3.0 టెక్నాలజీ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విస్టస్ ప్రొటెక్షన్ ను ఇచ్చింది వన్‍ప్లస్. హాసెల్‍బ్లాడ్ ప్రీమియమ్ కెమెరాలను వన్‍ప్లస్ 11 5జీ కలిగి ఉంది. వెనుక మూడు కెమెరాల సెటప్‍తో ఈ మొబైల్ వస్తోంది. 50 మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరాగా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ పోట్రయిట్ కెమెరా కూడా వెనుక ఉంటాయి. 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు OnePlus ఇచ్చింది.

బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్..

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‍ప్లస్ 11 5జీ వస్తోంది. 100 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‍ సపోర్ట్ ఉంటుంది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, NFC, GPS కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది. డాల్బీ ఆట్మోస్‍కు ఈ OnePlus 11 5G సపోర్ట్ చేస్తుంది.

వన్‍ప్లస్ 11 5జీ ధర, సేల్..

వన్‍‍ప్లస్ 11 5జీ రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదలైంది.
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర: రూ.56,999
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర: రూ.61,999
వన్‍ప్లస్ వెబ్‍సైట్‍, ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఈనెల 14వ తేదీన వన్‍ప్లస్ వెబ్‍సైట్, అమెజాన్‍తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ వన్‍ప్లస్ 11 5జీ ఓపెన్ సేల్‍కు వస్తుంది. ఎటర్నల్ గ్రీన్, బ్లాక్ కలర్లలో OnePlus 11 5G లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement