జమ్ముకశ్మీర్‌లో భూమి కుండిపోయి రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలోని దుక్సర్ దాల్వా గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతినగా.. పలు ప్రాంతాల్లో భూమి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని దుక్సర్ దాల్వాలో కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. రోడ్లు కుంగిపోవడంతో ప్రధార రహదారులపై వాహనాల రాకపోకలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని, త్వరలోనే కొత్త ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు, భూమి కుండిపోయినట్లు వారు పేర్కొంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement