ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 2025 జనవరి 1వ తేదీ వరకు అన్ని రకాల టపాసులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో అన్ని రకాల పటాకుల వినియోగం, తయారీ, నిల్వ, అమ్మకాలు అనుమతించరాదని పేర్కొంది.
వాయు కాలుష్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ వెల్లడించింది. చలికాంలో ఢిల్లీలో వాయుకాలుష్యం సమస్య తీవ్రమవుతుందని, బాణసంచా కాల్చడం కూడా దీనికి కారణమవుతుందని తెలిపింది. కాగా, ఢిల్లీ ప్రజలందరూ సహకరించాలని కమిటీ కోరింది.