Friday, November 22, 2024

గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగార్థులకు సీపీటీ ఉత్తీర్ణత తప్పనిసరి

అమరావతి,ఆంధ్రప్రభ: ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్ధులు ఇక నుండి తప్పనిసరిగా కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్ట్‌ (సిీపీటీ) పాస్‌ అవ్వాలి. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సీపీటీని ఎపిపిఎస్‌సి, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి సంయుక్తంగా నిర్వహిస్తాయి. సీపీటీ పాస్‌ సర్టిఫికేట్‌ లేకుండా గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 పోస్టుల నియమానికి అర్హత లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. డెరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా చేరే గ్రూపు -2, గ్రూపు -3 అభ్యర్ధులందరూ సిపిటి పాస్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలంటూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

సిీపీటీ పరీక్షను వంద మార్కులకు నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్‌సి,ఎస్‌టి, దివ్యాంగులు 30 మార్కులు, బిసిలు 35, ఓసీలు 40 మార్కులు పొందాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, విండోస్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాల్లో పరీక్ష పేపర్‌ ఉంటుంది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement