కోల్‌కతా : సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఇవాళ కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన భట్టాచార్యను తన ఇంటి నుంచి గ్రీన్ చానెల్ ద్వారా ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై మాజీ సీఎంకు చికిత్స కొనసాగుతోంది. ఆయనలో ఆక్సిజన్ లెవల్స్ 70 శాతానికి పడిపోయాయని, దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహా కోల్పోయారని పేర్కొన్నారు. కార్డియాలజిస్టులు, పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో భట్టాచార్యకు వైద్యం కొనసాగుతోందని తెలిపారు. భట్టాచార్య వెంట ఆయన భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.