సీపీఏం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో మృతి చెందారు. ఆయన వయసు 34 సంవత్సరాలు. కొవిడ్ తో రెండు వారాల క్రితం గురుగావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆశిష్ అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మృతిచెందారు. కుమారుడి మృతితో ఏచూరి కుటుంబంలో విషాదం నెలకొంది. కుమారుడు మృతి చెందిన విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించారు. తన కుమారుడికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లకు ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement