పెట్రోల్ ధరల పెంపుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో చొక్కా విప్పేసి ఆందోళన చేశారు. పెట్రోల్ బంక్ దగ్గర నిలబడి రేట్ల పెరుగుదలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మోదీ గడ్డం పెరిగినట్లు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు.
పెట్రోల్‌ను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తేవాలని నారాయణ డిమాండ్ చేశారు. పెట్రోల్ రేటు తమిళనాడు కంటే ఏపీలో రూ.7 ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై పన్నులు వేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నారాయణ పేర్కొన్నారు. పెట్రోలు ధరల పెంపు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
ఈ వార్త కూడా చదవండి: కుప్పంలో పెట్రోల్ ధర రూ.110