విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆపగలరని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆయన నోరు తెరవాలని.. ఆపే శక్తి ఆయనకు ఉందని అన్నారు. తాము ఢిల్లీలో ధర్నాకు ప్రయత్నం చేసామని కానీ… విజయసాయి రెడ్డి వల్ల జరగలేదని చెప్పారు. మోదీ కాళ్ళపై పడే విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.
మోదీకి సీఎం జగన్ రాసే ప్రేమలేఖల వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. సీఎం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ వద్ద శిబిరానికి రావాలని.. ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరగాలన్నారు. అన్నీ ఆదానికి, అంబానీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని, సంపదను అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖకు అన్యాయం జరుగుతుంటే… కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. విశాఖకు, స్టీల్ ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు.. మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని హరిబాబు చెప్పాలన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ మిజోరాం గవర్నర్ పదవిని హరిబాబు తిరస్కరించాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజాపోరాటాలకు, ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: స్టీల్‌ప్లాంట్‌పై ‘జగన్నాటకం’: లోకేష్